‘ఈజ్ ఆఫ్ లివింగ్’ కాన్సెప్ట్ ను తీసుకొస్తున్నా.. ఏపీలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతోంది!: చంద్రబాబు

  • ఏపీని అత్యంత నివాసయోగ్యంగా మారుస్తా
  • దేశంలో ఎక్కడాలేని అభివృద్ధి ఏపీలో జరుగుతోంది
  • వీడియో కాన్ఫరెన్స్ లో చంద్రబాబు
ప్రజలు నివసించేందుకు ప్రపంచంలోనే అత్యంత యోగ్యమైన ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ ను మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇందుకోసం ఈజ్ ఆఫ్ లివింగ్ అనే కాన్సెప్ట్ ను ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. ఈ రోజు అమరావతిలో ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..ఈ త్రైమాసికంలో 11.25 శాతం వృద్ధిరేటును సాధించామని తెలిపారు. ప్రజల మద్దతు లేకుండా రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. కష్టపడి పనిచేస్తేనే అద్భుతమైన ఫలితాలు సాధించగలమని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఉన్న కష్టాలను టెక్నాలజీ సాయంతో అధిగమించామని సీఎం చెప్పారు.

చంద్రన్న బీమా పథకంపై  62.5 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని సీఎం తెలిపారు. ఇంకా కష్టపడి పనిచేస్తే ఏటా 15 శాతం వృద్ధిరేటును సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. తన దూరదృష్టితో పాటు అధికారుల కృషి కారణంగానే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ టాప్ పొజిషన్ లో నిలిచిందని చంద్రబాబు తెలిపారు.
Go Back to Shorts
Chandrababu
Andhra Pradesh
VIDEO CONFERENCE
EASE OF LIVING

More Telugu News